Bhagavad-Gita

 

CONTENTS

1. అధ్యాయము: అర్జున విషాద యోగము (అర్జునుని సందిగ్ధత) 5

సైన్యాధ్యక్షుల పరిచయం 118. 6

అర్జునుడు సైన్యాన్ని పరిశీలించాలనుకున్నాడు... 6

అర్జునుని సందిగ్ధత.. 7

అర్జునుడు యుద్ధం వలన వచ్చే చెడులను వివరించాడు... 8

రాజభోగాల కోసం బంధుమిత్రులను చంపడం ఘోరమైన పాపమేమో! 8

2. వ అధ్యాయము: సాంఖ్య యోగము (పారమార్థిక జ్ఞానం) 9

అర్జునుడు యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడుతాడు 9

గీతా బోధనలు ప్రారంభం.... 10

ఆత్మ శాశ్వతమైనది, శరీరం అశాశ్వతమైనది... 11

శ్రీకృష్ణుడు అర్జునుడికి, యోధునిగా తన కర్తవ్యాన్ని గుర్తుచేస్తాడు 12

కర్మయోగం ప్రాముఖ్యత, నిస్వార్ధ సేవ.. 13

వేదాలు జీవితంలోని భౌతిక మరియు ఆధ్యాత్మిక విషయాలతో వ్యవహరిస్తాయి 14

కర్మయోగం యొక్క సిద్ధాంతం మరియు ఆచరణ.. 15

జ్ఞానిని గుర్తించడానికి గుర్తులు... 16

ఇంద్రియాలను అదుపులో ఉంచుకోకపోతే ప్రమాదాలు... 16

ఇంద్రియ నియంత్రణ మరియు స్వీయ జ్ఞానం ద్వారా శాంతి మరియు ఆనందాన్ని పొందడం 17

3. వ అధ్యాయము: కర్మయోగము.... 18

ప్రతీ ఒకరు ఇతరులకు ఎందుకు సేవ చేయాలి?. 19

నాయకులు మార్గదర్శకులు కావాలి... 21

అన్ని కర్మలు ప్రకృతి నిర్దేశించినవే.... 22

పరిపూర్ణత మార్గంలో రెండు ప్రధాన అవరోధాలు... 23

కామం (కోరిక) పాపానికి మూలం.... 23

కోరికలను ఎలా నియంత్రించాలి?. 24

4. వ అధ్యాయము: జ్ఞాన యోగము.... 24

కర్మ యోగం ఒక పురాతనమైన సిద్ధాంతం.... 24

భగవంతుని అవతారం యొక్క ఉద్దేశ్యం...... 24

ఆరాధన, ప్రార్థన చేసే విధానం.... 25

విహిత, వికర్మ మరియు అకర్మ కర్మలు... 26

కర్మయోగి కర్మబంధనాలకు లోబడి ఉండడు... 26

వివిధ రకాల ఆధ్యాత్మిక పద్ధతులు... 27

అతీంద్రియ జ్ఞానాన్ని పొందడం ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన 28

నిర్వాణానికి అతీంద్రియ జ్ఞానం మరియు కర్మయోగం రెండూ అవసరం 29

5. వ అధ్యాయము: కర్మ సన్యాస యోగము.... 29

కర్మయోగి భగవంతుని కోసమే కర్మలు చేస్తాడు... 30

ఆధ్యాత్మి జ్ఞానము యొక్క మార్గం.... 31

మూడవ మార్గం --- భక్తి ధ్యానం మరియు ధ్యానం యొక్క మార్గం 33

6. వ అధ్యాయము: ధ్యాన యోగము.... 33

కర్మ యోగి కూడా పరిత్యాగి.. 33

యోగం మరియు యోగి నిర్వచనం.... 33

మనస్సే ఒక స్నేహితుడు మరియు శత్రువు... 34

ధ్యానము- పద్ధతులు... 34

యోగి అంటే ఎవరు?. 36

మనస్సును నిగ్రహించడానికి రెండు పద్ధతులు... 37

యోగ లక్ష్యము సాధించని యోగి పరిస్థితి... 37

ఎవరు ఉత్తమమైన యోగి?. 38

7. అధ్యాయము: జ్ఞాన విజ్ఞాన యోగము.... 39

పదార్థం, స్పృహ మరియు ఆత్మ గురించి నిర్వచనాలు... 39

సర్వోన్నత ఆత్మ అన్నింటికీ ఆధారం.... 39

భగవంతుని శరణు కోరేదెవరు?. 40

8. వ అధ్యాయము: అక్షర బ్రహ్మ యోగము.... 42

పునర్జన్మ మరియు కర్మ సిద్ధాంతం.... 42

భగవంతుని-సాక్షాత్కారానికి సులువు మార్గము.... 43

మరణ సమయంలో భగవంతుడిని ధ్యానించడం ద్వారా మోక్షాన్ని పొందండి 43

నిష్క్రమణ (మరణించడం) యొక్క రెండు ప్రాథమిక మార్గాలు 45

9. వ అధ్యాయము: రాజవిద్యా రాజగుహ్య యోగము.... 45

జ్ఞానుల మరియు అజ్ఞానుల మార్గాలు... 47

పరమాత్మే ప్రతీ రూపము అవుతుంది... 47

భక్తి పూర్వక ప్రేమ ద్వారా మోక్షాన్ని పొందడం.... 48

ప్రేమ, భక్తితో భగవంతుని ఏది సమర్పించినా స్వీకరిస్తాడు 49

క్షమించరాని పాపి ఎవరూ ఉండరు... 49

భక్తి ప్రేమ మార్గం సులభం.... 49

10. వ అధ్యాయము: విభూతి యోగము.... 50

సమస్త సృష్టికి మూలాధారం భగవంతుడే.... 50

భగవంతుడు ఆయన భక్తులకు దివ్యజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. 51

యదార్థ స్వరూపాన్ని ఎవరూ తెలుసుకోలేరు... 51

పరమాత్మే ప్రతీ రూపము అవుతుంది... 52

దైవ ఆవిర్భావములను గురించి క్లుప్త వివరణ.. 52

అనంతమైన సృష్టిలో తెలుసున్నది చిన్న భాగమే..... 54

11. వ అధ్యాయము: విశ్వరూప సందర్శన యోగము. 54

అన్వేషకుడి అంతిమ లక్ష్యం భగవంతుని దర్శనం.... 54

శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వ రూపాన్ని చూపిస్తాడు... 55

భగవంతుడిని చూడటానికి ఎవరూ సిద్ధంగా ఉండకపోవచ్చు లేదా అర్హత పొందలేకపోవచ్చు 55

అర్జునుడు విశ్వ రూపం చూసి భయపడ్డాడు... 57

మేము ఒక దైవిక పరికరం మాత్రమే..... 58

విశ్వ రూపానికి అర్జునుడి ప్రార్థనలు... 58

భగవంతుడిని ఏ రూపంలోనైనా చూడవచ్చు... 60

భక్తి ప్రేమ ద్వారా భగవంతుడిని చూడవచ్చు... 60

12. వ అధ్యాయయు: భక్తి యోగము.... 61

సాకార రూపము లేదా నిరాకార బ్రహ్మాన్ని దేనిని ఆరాధించాలి? 61

భగవంతుని సాకార (వ్యక్తిగత) రూపాన్ని ఆరాధించడానికి కారణాలు 61

భగవంతుని చేరేందుకు నాలుగు మార్గాలు... 62

కర్మయోగము చాలా ఉత్తమమైనది... 62

భక్తుడి లక్షణాలు... 62

దైవిక లక్షణాలను పెంపొందించడానికి హృదయపూర్వకంగా ప్రయత్నించాలి 63

13. వ అధ్యయము: క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము 64

సృష్టి సిద్ధాంతం.... 64

మోక్ష సాధనంగా నాలుగు విధాల దివ్యమైన సత్యం...... 65

భగవంతుడిని నీతికథల ద్వారా వర్ణించవచ్చు తప్ప వేరే విధంగా కాదు 65

పరమాత్మ, ఆత్మ, భౌతిక స్వభావం మరియు వ్యక్తిగత ఆత్మ యొక్క వివరణ 66

విశ్వాసం మాత్రమే నిర్వాణానికి దారితీస్తుంది... 67

ఆత్మ లక్షణాలు... 68

14. వ అధ్యయము: గుణ త్రయ విభాగ యోగము.... 68

అన్ని జీవులు ఆత్మ మరియు ప్రకృతి యొక్క సంయోగం నుండి జన్మిస్తాయి 68

భౌతిక స్వభావం యొక్క త్రిగుణములు ఆత్మను శరీరానికి ఎలా బంధిస్తాయి 69

ప్రకృతి యొక్క త్రిగుణాల లక్షణాలు... 69

వ్యక్తి ఆత్మల పరకాయ ప్రవేశం కోసం త్రిగుణాలు వాహకాలుగా ఉంటాయి 70

భౌతిక స్వభావం త్రిగుణాలను దాటిన తర్వాత నిర్వాణాన్ని పొందండి 70

త్రిగుణాలకు అతీతంగా ఉండే విధానం.... 70

నిష్కల్మష భక్తి ద్వారా త్రిగుణాలకు అతీతులవగలరు... 71

15. వ అధ్యాయము: పురుషోత్తమ యోగము.... 71

సృష్టి అనేది మాయ శక్తులచే సృష్టించబడిన చెట్టు లాంటిది 71

జీవాత్మ ఆనందం.... 72

సర్వస్వం యొక్క సారాంశం ఆత్మే..... 73

పరమాత్మ, ఆత్మ మరియు సృష్టించిన జీవులు ఏమిటి?. 73

16. వ అధ్యాయము: దైవాసుర సంపద్విభాగ యోగము.... 74

మోక్షసాధన కోసం దైవీ సంపద కలవాని లక్షణాలు... 74

వదిలివేయవలసిన దెయ్యాల లక్షణాల జాబితా.... 74

మానవులలో రెండు రకాలు మాత్రమే ఉన్నారు: జ్ఞానులు మరియు అజ్ఞానులు 74

బాధ అనేది అజ్ఞానుల విధి... 76

శాస్త్రాలను ప్రమాణంగా తీసుకోవాలి... 76

17. వ అధ్యయము: శ్రద్ధా త్రయ విభాగ యోగము.... 77

మూడు రకాల విశ్వాసాలు... 77

మూడు రకాల ఆహారాలు... 77

మూడు రకాల త్యాగాలు... 78

వాక్కు సంబంధమైన తపస్సు... 78

మూడు రకాల తపస్సులు... 79

మూడు రకాల దానాలు... 79

పరబ్రహ్మమునకు సూచిక పదాలు... 79

18. వ అధ్యాయము: . మోక్ష సన్యాస యోగము.... 80

సన్యసించడం మరియు త్యజించడం నిర్వచనం.... 80

మూడు రకాలైన త్యాగాలు... 81

కర్మ యొక్క ఐదు కారకాలు... 81

మూడు రకాల జ్ఞానాలు... 82

మూడు రకాల కర్మలు... 82

మూడు రకాల కర్తలు... 83

మూడు రకాల బుద్ధులు... 83

మూడు రకాల సంకల్పాలు మరియు మానవ జీవితంలోని నాలుగు లక్ష్యాలు 83

మూడు రకాల ఆనందాలు... 84

విధి, క్రమశిక్షణ మరియు భక్తి ద్వారా మోక్షాన్ని పొందడం 85

కర్మ బంధం మరియు స్వేచ్ఛా సంకల్పం.... 86

లొంగిపోయే మార్గమే భగవంతుని చేరడానికి అంతిమ మార్గం 87

భగవంతునికి అత్యున్నత సేవ, మరియు ఉత్తమ దాతృత్వం 88

గీతా ప్రాముఖ్యత.. 88

జ్ఞానం మరియు కర్మ రెండూ అవసరం.... 89

 

BHAGAVAD-GITA VERSES

(తెలుగులో భగవద్గీత శ్లోకం)

(English Translation by IGS)

www.gita-society.com

 

1. అధ్యాయము: అర్జున విషాద యోగము (అర్జునుని సందిగ్ధత)

ధృతరాష్ట్రుడిట్లు పలికెను: ఓ సంజయా, నావారైన దుర్యోధనాదులు, పాండుకుమారులైన ధర్మరాజాదులు యుద్ధము చేయు కుతూహలముతో పుణ్యభూమి ఐన కురుక్షేత్రమున చేరి ఏమి చేసిరి? (1.01) సంజయుడు చెప్పెను: రాజైన దుర్యోధనుడు వ్యూహాకారములో నిలిచి ఉన్న పాండవసేనను చూచి, గురువగు ద్రోణాచార్యుని సమీపించి ఇట్లు పలికెను: (1.02) ఓ గురువర్యా! బుద్ధిశాలియు మీ శిష్యుడు అయిన ధష్టద్యుమ్నుని చేత వ్యూహాకారముగ రచింపబడియునట్టి పాండవుల ఈ గొప్ప సైన్యాన్ని చూడుము! ఈ పాండవసేన యందు గొప్ప విలుకాండ్రును, శూరవీరులును, పరాక్రమవంతులును, మహారధులును ఉన్నారు. మీ కోసం వారిలో కొందరి పేర్లు చెప్పెదను.(1.03-06) ఇక మన సైన్యములో ప్రముఖులు సేనానాయకులు ఎవరు కలరో వారి గురించి మీకు చెప్పుచున్నాను.

సైన్యాధ్యక్షుల పరిచయం 118

నా కోసం తమ తమ జీవితాలను ధారబోయునట్టి అనేక ఇతర శూరులు, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము, వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీకు తెలియడం కోసం ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను. (1.07-09) మన సైన్యము అపరిమితంగా ఉంది, కానీ పాండవుల సైన్యము పరిమితముగా ఉండటంతో జయించడానికి ఎక్కువ అవకాశముగా ఉన్నది. కావున, కౌరవ సేనా నాయకులందరికీ, మీమీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను. (1.10-11) పరాక్రమశాలి, కురువృద్ధుడూ అయిన భీష్మ పితామహుడంతట దుర్యోధనునికి ఉత్సాహము కలుగునట్లు పెద్దగా సింహధ్వని చేసి శంఖమును పూరించెను (ఊదెను).(1.12) దాని తర్వాత, సైన్యమందున్న మిగిలిన వారు కూడా శంఖములను, భేరులను, తప్పెటలు మున్నగువానిని వెంటనే మ్రోగించిరి. ఆ శబ్దముతో దిక్కులు పిక్కటిల్లెను. (1.13) అపుడు తెల్లని గుర్రములతో కూడిన గొప్ప రథమునందు కూర్చున్న కృష్ణార్జునులిద్దరూ తమ తమ దివ్యమైన శంఖములను గట్టిగా ఊదిరి. (1.14) శ్రీ కృష్ణుడు తన శంఖమును ఊదెను; అపుడు అర్జునుడు మరియు మిగిలిన సేనాని వారికి సంబంధించిన శంఖములను ఊదిరి. పాండవ వీరుల శంఖముల యొక్క ధ్వని భూమ్యాకాశాలను దద్ధరిల్లుచేయుచూ కౌరవాదుల గుండెలను బ్రద్దలు చేసెను. (1.15-19)

అర్జునుడు సైన్యాన్ని పరిశీలించాలనుకున్నాడు

రణరంగమున ఆయుధములు ప్రయోగించడానికి సిద్దముగా యుద్ద సన్నద్ధులై ఉన్న కౌరవులను చూసి, కపిధ్వజుడగు అర్జునుడు ధనుస్సును చేత పూని, శ్రీకృష్ణుడితో ఈ విధంగా పలికెను: ఓ కృష్ణా! ఈ యుద్దం మొదలు పెట్టేముందు నేనెవరితో యుద్దము చేయవలెనో, అట్టి ఈ యుద్ధాభిలాషులను నేను ఎక్కడి నుండి బాగా చూడగలనో అక్కడ రెండు సేనల మధ్య నా రథమును నిలుపుము. (1.20-22) దుష్టబుద్ధిగల దుర్యోధనునికి యుద్ధమున సంతోషమును కలిగించవలెననే కోరిక కలిగి, ఇక్కడకు చేరిన ఈ యోధులను నేను చూడాలనుకుంటున్నాను. (1.23) సంజయుడు చెప్పెను: ఓ రాజా! అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఉత్తమమైన ఆ రథమును రెండు సేనల మధ్య భీష్ముడు, ద్రోణుడు, ఇంకా మిగిలిన రాజులందరి ఎదుట నిలిపి, అర్జునుడితో, ఇక్కడ చేరిన ఈ కౌరవులను చూడమని చెప్పెను. (1.24-25) అక్కడ, అర్జునుడు రెండు సేనలయందూ నిలబడి ఉన్న తండ్రులను, తాతలను,, గురువులను, మనుమలను, స్నేహితులను, మామలను, హితైభిలాషులను (అందరినీ) చూసెను. (1.26)

అర్జునుని సందిగ్ధత

రెండు సైన్యాల వరుసలలో నిలబడి ఉన్న తండ్రులు, సహచరులు మరియు అతని బంధువులందరినీ చూసి అర్జునుడు కరుణార్ధహృదయుడై దు:ఖంతో ఇలా అన్నాడు: ఓ కృష్ణా! యుద్దము చేయడానికి ఇక్కడ సమకూడిన ఈ బంధుజానాన్ని చూచి నా అవయవములు పట్టు తప్పుతున్నవి; నోరెండుపోతున్నది, శరీరమందు వణుకు పుట్టుచున్నది; రోమాలు నిక్కబోడుచుకుంటున్నాయి; (1.27-29) గాండీవము చేతినుండి జారిపోతున్నది; చర్మము మండుతున్నది; నిలబడుటకు కూడా నాకు శక్తి సరిపోవడంలేదు; తల గిర్రున తిరుగుచున్నది. ఓ కృష్ణా! అపశకునములను కూడా చూస్తున్నాను. యుద్దములో బంధువులను చంపి తర్వాత పొందబోయే లాభమేమిటో నాకు కనిపించడం లేదు. (1.30-31) నేను విజయమును కానీ, రాజ్యమును కానీ, సుఖములను కానీకోరను, ఓ కృష్ణా! ఎవరి కోసం రాజ్యము లేదా భోగము లేదా చివరికి జీవితం? ఎవరి కోసమయితే రాజ్యమును, సుఖములను, భోగములను కోరుకుంటున్నామో, అట్టి గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, సంబంధితులందరూ తమ ప్రాణాల మీద, ధనము మీద ఆశ వదులుకుని ఈ రణరంగమునందు వచ్చి నిలబడి ఉన్నారు. (1.32-33) నన్ను చంపుదామనుకున్న వారైనప్పటికీ, వీరిని ముల్లోకముల రాజ్యాధిపత్యము కోసం కూడా నేను వారిని చంపడానికి ఇష్టపడను, అలాంటిది, భూలోక రాజ్యము కోసం ఏ విధంగా చేయగలను కృష్ణా? (1.34-35)

ఓ కృష్ణా! దుర్యోధనాదులను చంపడం వలన మనకేమి సంతోషము కలుగును? దుర్మార్గులైన వీరిని చంపుట వలన మనకు పాపమే కలుగును. (1.36) ఓ కృష్ణా! కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ధృతరాష్ట్రుని కుమారులు నా సోదరులు, నాకు కావల్సిన వాళ్లు, నా దగ్గర బంధువులు. వీళ్లను చంపడం న్యాయమా చెప్పు.(1.37) ఓ కృష్ణా! ఈ దుర్యోధనుడు, దుశ్శాశనుడు పరమ లోభులు, వారికి రాజ్యకాంక్ష, పదవీ కాంక్ష, రాజ్య సుఖాలు తప్ప మరొకటి తెలియదు. వీరు బంధువులకే కాదు తమ మిత్రులకు కూడా ద్రోహం చేస్తారు. మనకు అన్నీ తెలుసు కదా!(1.38-39)

అర్జునుడు యుద్ధం వలన వచ్చే చెడులను వివరించాడు

కులము నాశనమయితే అనాదిగా వస్తున్న కుల ధర్మములు అంతరించిపోతాయి. ధర్మము నశించి పోవుటచే కులమంతటా అధర్మము వ్యాపించును. (1.40) అధర్మము వృద్ధి చెందుటచే కులస్త్రీలు చెడిపోవుదురు. ఎప్పుడయితే స్త్రీలు చెడిపోవుదురో అప్పుడు వర్ణసంకరం ఏర్పడును. ఎవరికి పుట్టారో, ఎవరు ఏ వర్ణమో, ఏ కులమో తెలియకుండా పోతుంది. (1.41) వర్ణ సంకరం జరిగితే ఈ యుద్ధంలో మరణించిన వారికి అంత్యక్రియలు, శ్రాద్ధకర్మలు, జలతర్పణములు లేనివారై అథోగతి పాలవుతారు. (1.42) జాతి ధర్మాలు అన్నీ శాశ్వతంగా నాశనం కావడానికీ ఈ యుద్ధమే కారణము. అందులో సందేహము లేదు. (1.43) కులధర్మాలు, వర్ణ సంకరాలు, జాతి ధర్మాలు నాశనం కావడానికి కారణం అయిన ఈ యుద్ధం చేసిన వారికి కూడా శాశ్వత నరకలోకం ప్రాప్తిస్తుందని పెద్దలు చెప్పగా విన్నాను. (1.44)

రాజభోగాల కోసం బంధుమిత్రులను చంపడం ఘోరమైన పాపమేమో!

అయ్యో! రాజ్యం కోసం, రాజభోగాలు అనుభవించడం కోసం బంధువులను, మిత్రులనుచంపి, ఘోరమైన పాపం చేయడానికి మనం సన్నద్ధం అయ్మాము. (1.45) ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు, ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా, దీనికంటే మేలే. (1.46) సంజయుడు చెప్పెను: ఆ ప్రకారంగా అర్జునుడు మనసంతా శోకంతో శత్రువుల మీద దయతో, జాలితో, కరుణ నిండినవాడై, తన గాంఢీవమును, అస్త్ర, శస్త్రములను కింద పెట్టి, రథం వెనుక ఏమీ చేతకాని వాడివలె చతికిలబడెను. (1.47)

2. వ అధ్యాయము: సాంఖ్య యోగము (పారమార్థిక జ్ఞానం)

సంజయుడు పలికెను: కళ్లనిండా నీళ్లు తిరుగుతూ, అర్జునుని మనసు బాధతో నిండిపోయి ఉంది. విషాదంలో మునిగిపోయిన అర్జునితో శ్రీ కృష్ణుడు ఇలా పలికాడు. (2.01) శ్రీ భగవానుడు చెప్పెను: ఓ అర్జునా! ఈ సమయంలో నీకు ఈ శోకము, మోహము, దు:ఖము, మనోదౌర్భల్యము ఎలా దాపురించాయి? నీలాంటి వీరులు, పరాక్రమవంతులు ఇలా చేస్తారా, అదీ ఈ సమయంలో! యుద్ధం చేయకపోతే నీకు స్వర్గం వస్తుందా? (2.02) ఓ అర్జునా! ఈ పిరికితనం నీకు ఎలా వచ్చింది? నా మాట విని నీ హృదయ దౌర్భల్యాన్ని వదిలిపెట్టు. నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు. లే! ధనుర్భాణాలు తీసుకో! యుద్ధానికి సన్నద్ధం కా! (2.03)

అర్జునుడు యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడుతాడు

అర్జునుడు పలికెను: ఓ కృష్ణా! భీష్ముడు, ద్రోణుడు పూజింపదగినవారు. అట్టివారి మీద బాణములను సంధించి నేను ఎలా యుద్ధం చేయగలను? (2.04) మహానుభావులైన ఇటువంటి గురువులను చంపే కంటే ఈ లోకమునందు భిక్షాన్నము భుజించుట మంచిది. వారిని చంపినచో వారి రక్తముతో తడిసి ధన భోగాలనే అనుభవించవలసి వస్తుంది. (2.05) అంతేకాకుంతడా ఈ యుద్ధమున మనము గెలుస్తమో లేక వారు గెలుస్తారో కూడా చెప్పలేము. ఈ రెండింటింలో ఏది మంచిదో కూడా తెలియదు. ఇచట మన ఆత్మీయులే మనను ఎదిరింప మన ఎదురుగా యుద్ధమున నిలిబడి ఉన్నారు. (2.06)

ఓ కృష్ణా! ప్రస్థుతము నా బుద్ధికి ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి నశించింది. అంతా అయోమయంగా ఉంది. ఈ సమయంలో నీవే నాకు దిక్కు. నన్ను నీ శిష్యుడిగా భావించి ఏది శ్రేయస్కరమో ముందు నీవు నిర్ణయించుకుని తరువాత ఆ మార్గాన్ని నాకు చూపించు. నేను నీ మాట జవదాటను; శరణు కోరు నన్ను ఈ ప్రకారముగా నడుచుకొనుము అని శాసింపుము. (2.07) నాలో కలిగిన ఈ దు:ఖము, నా ఇంద్రియాలను దహించి వేస్తోంది. సిరిసంపదలతో కూడిన శత్రువులు లేని రాజ్యము లభించిను చివరకు ఇంద్రపదవి, స్వర్గసుఖాలు, ఏమి లభించినా శోకాగ్ని చల్లారేట్లు కనిపించడం లేదు. (2.08) సంజయుడు చెప్పెను: ఓ రాజా! ఈ విధంగా అర్జునుడు శ్రీ కృష్ణునితో చెప్పి నేను ఇక యుద్ధము చేయనని పలికి మౌనము వహించెను. (2.09) ఓ రాజా, రెండు సేనల మధ్య బాధపడుతూ ఉన్న అర్జునుని చూసి, శ్రీకృష్ణుడు నవ్వుచున్న వాడివలె ఈ విధముగా పలికెను. (2.10)

గీతా బోధనలు ప్రారంభం

శ్రీకృష్ణ భగవానుడు చెప్పెను: ఓ అర్జునా! ఎవరి కోసం అయితే శోకించడం తగదో వారి గురించి నీవు శోకిస్తున్నావు; పైగా అన్నీ తెలిసిన పండితుని వలె నీవు మాట్లాడుతున్నావు. నిజంగా పండితులు, జ్ఞానులు, జీవించి ఉన్న వారి గురించి గానీ, ఇంతకు ముందే మరణించిన వారి గురించి గానీ ఎన్నడూ శోకించరు. (2.11) నేను కానీ, నువ్వు కానీ, ఈ రాజులు కానీ, ఇప్పటి వరకూ లేకుండా ఉండని కాలము లేదు. భవిష్యత్తులో ఉండబోరు అనే మాట కూడా లేదు. (2.12) కేవలం జీవునకీ శరీరమునందు (ఆత్మ,జీవాత్మ) బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం ఇలా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. మరణం తర్వాత ఈ దేహం పోతే మరొక దేహం వస్తుంది. కాబట్టి ఈ విషయాలలో జ్ఞాని అయినవాడు ఎంతమాత్రమూ శోకము చెందడు. (15.08 లో కూడా చూడండి) (2.13) ఓ అర్జునా! ఇంద్రియముల యొక్క శబ్దస్పర్శాది విషయ సంయోగములు ఒకసారి చల్లదనాన్ని, ఒకసారి వేడిని, ఒకసారి సుఖమును, మరొకసారి దు:ఖమును కలుగజేస్తుంటాయి. అవి వస్తూ పోతూ అస్థిరంగా ఉంటాయి. కాబట్టి వాటిని ఓర్చుకో. (2.14) ఓ అర్జునా! ఏ వ్యక్తినయితే బయట ప్రపంచంలో ఉన్న ఆకర్షణలు, వాటి వలన కలిగే సుఖ దు:ఖములు ఎటువంటి బాధను కలిగించవో, ఎవరైతే సుఖదు:ఖములందు సమభావం కలిగి ఉంటాడో, అటువంటి వ్యక్తే మోక్షమునకు అర్హుడగును. (2.15)

ఆత్మ శాశ్వతమైనది, శరీరం అశాశ్వతమైనది

అనిత్యమైనదానికి అంటే లేని దానికి ఉనికి లేదు. సత్యమైన దానికి అంటే ఉన్నదానికి, లేకుండా పోవడం అంటూ ఉండదు. సత్, అసత్ ఈ రెండింటి యొక్క నిజస్వరూపాలను తెలుసుకున్నవాడు తత్వజ్ఞాని. కేవలం తత్వము గురించి జ్ఞానము కలవాడికే ఈ రెండింటి యొక్క స్వరూప, స్వభావాలు తెలుస్తాయి. (2.16) ఓ అర్జునా! ఈ సమస్త ప్రపంచమూ ఏ పరమాత్మ చేత వ్యాపించబడి ఉన్నదో, అది నాశనము లేకుండా ఉన్నదని తెలుసుకో. అవ్యయమగు అట్టి ఆత్మకు వినాశనాన్ని ఎవడూ కలుగచేయలేదు. (2.17) ఓ అర్జునా! ఈ శరీరాలు అన్నీ నశించి పోయేవే. కాని ఆత్మ మాత్రము నాశనము కాదు. ఎందుకంటే ఆత్మ అవినాశి, అప్రమేయము, నిత్యము. ఈ విషయం తెలుసుకుని నువ్వు యుద్ధం చెయ్యి. (2.18) ఈ ఆత్మ ఇతరులను చంపుతుంది అని అనుకునేవాడు, ఈ ఆత్మ ఇతరుల చేత చంపబడుతుంది అని అనుకునేవాడు, ఇద్దరూ అజ్ఞానులే. ఎందుకంటే ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరి చేతిలోనూ చావదు. (2.19) ఆత్మ ఎన్నడూ పుట్టలేదు. పుట్టలేదు కాబట్టి చావులేదు. పుట్టుక లేదు కాబట్టి ఉండటం, ఉండకపోవడం అంటూ కూడా లేదు. అంటే ఆత్మకు పుట్టుక, ఉండటం, పెరుగుదల, మార్పు, తరుగుదల, చావు అనేటటువంటి ఆ ఆరు వికారములు ఏవీ లేదు. ఈ శరీరం మరణించినా ఆత్మ మరణించదు. (2.20) ఓ అర్జునా! ఎవరైతే ఈ ఆత్మను సత్యమైనదిగా, నాశనము లేనిదిగా, నిత్యమైనదిగా, జన్మలేనిదిగానూ, మార్పులేనిదిగానూ, మరణము లేనిదిగానూ తెలుసుకుంటాడో, అటువంటి వాడు ఎవరిని చంపిస్తాడు, ఎవరిని ఎందుకు చంపుతాడు? ఎలా చంపుతాడు. కాబట్టి ఎవరూ ఎవరిని చంపరు, చంపించరు. (2.21)

మరణం మరియు ఆత్మ యొక్క పరకాయ ప్రవేశం

ఓ అర్జునా! ఎలా అయితే మానవుడు చిరిగిన వస్త్రాన్ని విడిచి, కొత్త వస్త్రాన్ని ధరిస్తాడో, అలాగే ఈ శరీరములో ఉండే ఆత్మ కృశించిపోయిన పాత శరీరాన్ని విడిచిపెట్టి, కొత్త దేహాన్ని ధరిస్తుంది. (2.22) ఈ ఆత్మను ఎటువంటి అస్త్ర, శస్త్రములు ఛేదించలేవు. అగ్ని దహించలేదు, నీరు తడపలేదు.అలాగే గాలి వీచినప్పుడు ఎగిరి పోదు. గాలికి ఎండకు ఎండిపోదు. ఎటువంటి పరిస్థితులలో కూడా నిశ్చలంగా ఏమీ అంటనట్లు ఉంటుంది. (2.23-24) ఈ ఆత్మ ఎవరికీ కనపడదు. వినపడదు. వికారములు పొందింపదగనిదిగా ఉందని చెప్పబడుచున్నది. కావున ఈ విషయాన్ని తెలుసుకుని నీవు శోకించడం తగదు. (2.25) ఓ అర్జునా! ఒకవేళ ఈ ఆత్మ నిరంతరము పుట్టుచూ చచ్చుచూ ఉంటుందని తలంచిననూ అట్టి స్థితియందు కూడా నీవీ ప్రకారము శోకించుట తగదు. ఎందుకంటే, పుట్టిన వాడికి చావు తప్పదు. చచ్చిన వాడికి పుట్టుకా తప్పదు. తప్పనిసరైన ఈ విషయమున నీకు ఇంకా శోకించడం సరికాదు. 2.26-27) ఈ ప్రాణులన్నీ పుట్టక ముందు ఎవరికీ కనబడవు. మరణించిన తర్వాత ఎవరికీ కనబడవు. శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే కనబడతాయి. పుట్టుక, చావు ఈ మధ్యనే అదీ శరీరం ఉంది కాబట్టి శరీరాల ద్వారా మనందరి కళ్లకు కనపడుతున్నాయి. ఇట్టివాని విషయమై నీవు శోకింపనేల? (2.28) ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరొక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో కొందరు దీనిని గూర్చి ఏమియు ఎఱుగరు. (2.29) ఓ అర్జునా! ప్రతీ శరీరము నందూ ఉండే ఈ అత్మ చంప వీలుకానిది. కనుక ఏ ప్రాణి గురించి అయినా నీవు శోకించడం తగదు (2.30)

శ్రీకృష్ణుడు అర్జునుడికి, యోధునిగా తన కర్తవ్యాన్ని గుర్తుచేస్తాడు

అంతేకాక స్వధర్మమును బట్టి కూడా నీవు భయపడనవసరం లేదు. ఎందుకంటే క్షత్రియునకు ధర్మయుద్ధమును మించినట్టి శ్రేయస్కరమైనట్టి కర్తవ్యము మరియొకటి ఏదీ లేనేలేదు. (2.31) ఓ అర్జునా! యాదృచ్ఛికముగా సంభవించినట్టి ఈ యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెఱిచిన ద్వారము వంటిది. (2.32) ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని చేయకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయినవాడవు అవుతావు. దానివలన నీవు కీర్తిని కోల్పోతావు. అంతేకాకుండా నీవు పాపము చేసినవాడవవుతావు. (2.33) లోకులందరూ కూడా చాలా కాలము వరకూ నీ అపకీర్తిని గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటే చాలా బాధాకరంగా ఉంటుంది. (2.34) ఈ మహారధుల దృష్టిలో నీవు ఎంతో గొప్పవాడవు. యుద్దానికి విముఖుడవైతే వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అవుతావు. అంతేగాక నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లుగా వీరు భావిస్తారు. (2.35) నీ శత్రువులు నీ సామర్ధ్యమును నిందించుచూ నీ గురించి అనేకమైన అనరాని మాటలను అందురు. అంతకంటే దు:ఖమేమున్నది? (2.36) ఓ అర్జునా! రణరంగమునందు మరణించినచో వీరస్వర్గమును పొందెదవు. జయించినచో రాజ్యభోగములను అనుభవింతువు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధానికి లెమ్ము. (2.37) సుఖదు:ఖములయందును, లాభనష్టములందును, జయాపజయములందును సమబుద్ది కలిగి యుద్దమునకు సంసిద్ధుడవుకా. ఈ విధంగా చేసినచో నీవు పాపము పొందకుండా ఉండెదవు. (2.38)

కర్మయోగం ప్రాముఖ్యత, నిస్వార్ధ సేవ

ఓ అర్జునా! ఈ సమత్వ బుద్ధిని జ్ఞానయోగ బుద్ధితో తెల్పితిని. ఇపుడు దానినే కర్మయోగ దృక్పథముతో తెల్పెదను. వినుము. దానిని అర్ధం చేసుకుని ఆచరించినచో, కర్మబంధముల నుండి విముక్తుడవవుతావు. (2.39) ఈ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎప్పటికీ బీజనాశము లేదు. దీనికి విపరీత ఫలితములే ఉండవు. అంతే కాకుండా ఈ నిష్కామ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మమృత్యురూప మహాభయమునుండి కాపాడును.(2.40) ఈ నిష్కామ కర్మయోగమును అవలంబించిన వాడి బుద్ధి ఏకాగ్రంగా, నిశ్చయంగా ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక కోరిక మనసులో పెట్టుకుని దాని కొరకు కర్మచేస్తే వాడి బుద్ధి పరిపరి విధాల పోతుంది. కుదురుగా నిశ్చయంగా ఉండదు. (2.41)

వేదాలు జీవితంలోని భౌతిక మరియు ఆధ్యాత్మిక విషయాలతో వ్యవహరిస్తాయి

ఓ అర్జునా! వివేకము లేని మానవులు ప్రాపంచిక సుఖముల కోసం మాత్రమే పాకులాడుతూ ఉంటారు. అటువంటి వారు వేదములలో చెప్పబడిన విషయములను వాటి పైపై అర్ధములతో తీసుకుంటారు. ఎందుకంటే అవి కర్మలను, వాటి వలన వచ్చే ఫలముల గురించి చెబుతాయి. వేదములలో చెప్పబడిన విషయముల అంతరార్ధముల జోలికి పోరు. అటువంటి వారు యజ్ఞములు, యాగములు చేస్తే స్వర్గసుఖాలు లభిస్తాయని, స్వర్గసుఖములకు మించిన సుఖము లేదనీ అనుకుంటూ ఉంటారు. (2.42) ప్రాపంచిక సుఖములను, కోరికలను పొందడానికి అవసరమైన వ్రతాలు మొదలగు సకామ కర్మలను ఆచరిస్తారు. పండితులు కూడా ఈ సకామ కర్మలు వేదములో చెప్పబడ్డాయి అని ప్రచారం చెస్తారు. తియ్యగా ప్రవచనాలు చేస్తారు. (2.43) ఈ తియ్యటి కబుర్లు నమ్మిన మానవులు ఎల్లపుడూ స్వర్గసుఖముల మీద, లోకంలో లభించే భోగముల మీదా, సంపదల మీద ఆసక్తితో ఉంటారు. భోగైశ్వర్యములు అంటే ఇష్టమున్న జనులకు దైవధ్యానమందు ఏకాగ్రమైన బుద్ధి కలుగనే కలుగదు. (2.44) ఓ అర్జునా! వేదములు సంసార విషయములను తెలుపునవిగా ఉన్నాయి. వేదములలో చెప్పబడిన కర్మకాండలు, కేవలము మూడు గుణములలో అను నిత్యము వర్తించే వారికే గానీ నీకు కాదు. ద్వందాలకు అతీతంగా ఉండాలి. నీవు మాత్రం వాటి గురించి పట్టించుకోకు. వాటిని విడిచిపెట్టు. సుఖదు:ఖాలకు, జయాపజయాలకు అతీతంగా ఉండు. నీ మనస్సును పరమాత్మ యందు లగ్నం చెయ్యి. నీ యోగక్షేమముల గురించి ఆరాట పడవద్దు. నీ కర్తవ్యమును నీవు నిర్వర్తించు. (2.45) నీటితో నిండియున్న మహాజలాశయము, అందుబాటులో ఉన్నవానికి చిన్న జలాశయము ఒకే విధమైన ప్రయోజనాన్ని ఎలా ఇస్తాయో, అలాగే పరమాత్మ ప్రాప్తిని పొందిన బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతే ప్రయోజనం చేకూరుతుంది.(2.46)

కర్మయోగం యొక్క సిద్ధాంతం మరియు ఆచరణ

అర్జునా! కర్తవ్య కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు. దాని ఫలితముల యందు నీకు అధికారము లేదు. ఏ కర్మకు ఏ పలితం రావాలనే దానికి నీవు కారణం కాదు. అలా అని కర్మలు చేయకుండా ఉండటం యందు మక్కువ చూపకూడదు. ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా కేవలం కర్మలు చేయడమే నీకర్తవ్యము. (2.47) ప్రతి వాడు తాను చేయవలసిన కర్మలు తప్పకుండా చేయాలి. ఆ కర్మలను ఒక యోగంగా చేయాలి. చేయబోయే పని మీద అసక్తిని వదిలి, ఆ పని జరుగుతుందా జరగదా అనే అనుమానం వదిలి పెట్టాలి. చేసే పని శ్రద్ధగా చేయాలి. లాభము, నష్టముల మీద సమభావన కలిగి ఉండాలి. ఆ సమత్వమే ఒక యోగము. (2.48) సమత్వ బుద్ధితో చేసే కర్మల కన్నా, ఏవేవో కోరికలు తీరాలని కర్మలు చేయడం అంటే సకామ కర్మలు చేయడం చాలా తక్కువ స్ధాయికి చెందినవి. నీవు సమత్వబుద్ధిరూప యోగమును ఆచరింపుము. ఎందుకంటే ఏదో ఒక కోరికతో కర్మలు చేసే వాళ్లు అల్పులు, దీనులు, ఆశావహులు. అటువంటి వారికి దు:ఖమే మిగులుతుంది. (2.49)

వివేకముతో ఈ కర్మ శాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మ లోనే పుణ్య పాపములను రెంటినీ వదిలివేయును. కాబట్టి నైపుణ్యం తో పని చేయటం అనే, యోగాభ్యాసము చేయుము. ఇదియే కర్మయోగము. (2.50) సమత్వ బుద్ధి కలవారు తాము కర్మలు చేసినా ఆ కర్మఫలములను విడిచి పెడతారు. అటుంటి వారు జనన మరణ చక్రము నుండి విడివడతారు. శాశ్వత సుఖమును ఇచ్చే మోక్షమును పొందుతారు. (2.51) అర్జునా! నీ బుద్ధి ఎపుడు అజ్ఞానమనే మాలిన్యాన్ని దాటి వేస్తుందో అపుడిక వినవలసిన దానిని గురించీ వినిన దాని గురించి నీవు విరక్తి కలిగి యుందువు. (2.52)

నానా విధాలైన విషయములు తత్వములు వినడం వలన కలత చెందిన నీ బుద్ధి యెపుడు చలింపకుండా పరమాత్మ ధ్యానమందు స్థిరంగా నిలిచి యుండునో, అపుడు నీవాత్మసాక్షాత్కారమును పొందగలవు. (2.53) అర్జునుడు పలికెను: ఓ కృష్ణా! నిశ్చలమైన, అచంచలమైన సమాధిస్థితిని పొందిన మానవుడు ఎలా ఉంటాడు? అతడి లక్షణములు ఎలా ఉంటాయి? అతడెట్లు మాట్లాడును?ఎలా ప్రవర్తిస్తాడు? అటువంటి వాడిని గుర్తించడం ఎలాగా! వివరంగా చెప్పు అని అడిగాడు.(2.54)

జ్ఞానిని గుర్తించడానికి గుర్తులు

భగవానుడు చెప్పెను: స్థిత ప్రజ్ఞుడు అనేవాడికి కోరికలు ఉండవు. కోరికలు అనేవి మనసులో నుండి తొలగిపోతాయి. మనసును ఆత్మయందు లగ్నం చేసి అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతుంటాడు. ఆత్మను పరమాత్మతో సంయోగించి సంతుష్టుడై ఉంటాడు. ప్రాపంచిక విషయముల వలన కలిగిన ఆనందం కంటే అటువంటి ఆనందము గొప్పది అనే అనుభూతిని పొందుతాడు. అటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అని అంటారు. (2.55) దు:ఖము సంభవించినపుడు కుంగిపోనివాడు, సుఖములు ప్రాప్తించినపుడు పొంగిపోనివాడు, రాగమును, భయమును, క్రోధమును వదిలిపెట్టిన ధీరుడిని స్థితప్రజ్ఞుడు అంటారు. (2.56) దేనిమీదా, ఎవరి మీదా ఎక్కువగా మమతానురాగములు లేనివాడు, శుభమును, అశుభమును సమానంగా చూసేవాడు, ఒకరిని అభినందించడం, మరొకరిని ద్వేషించడం చేయనివాడు, అటువంటి వానిలో బుద్ధి చక్కగా ప్రతిష్టితమై ఉంటుంది. (2.57) తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనునట్లు, జ్ఞాని యెపుడు తన జ్ఞానేంద్రియములను బయట ప్రపంచంలో ఉన్న విషయములను సర్వత్రా వెనుకకు మరల్చుచున్నాడో, అపుడాతని జ్ఞానము మిక్కిలి స్థిరమైనది అగును. అతడు స్థిత ప్రజ్ఞుడు. (2.58) సాధకులు ఇంద్రియములను భోగ వస్తు/విషయముల నుండి నియంత్రించినా, ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది. కానీ, భగవత్ తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ రుచి కూడా అంతమగును. కాని స్థితప్రజ్ఞుడు అయిన వాడి మనస్సు పరమాత్మలో లీనం అవుతుంది కాబట్టి, అటువంటి ఆసక్తి కూడా ఉండదు. (2.59)

ఇంద్రియాలను అదుపులో ఉంచుకోకపోతే ప్రమాదాలు

ఓ అర్జునా! ఇంద్రియములు చాలా శక్తివంతమైనవి. అవి జ్ఞానులు, వివేకవంతులు అయిన పురుషుల యొక్క మనసును కూడా చిలుకుతూ ఉండి, క్షోభింపచేస్తుంటాయి. బలాత్మారంగా (విషయాల వైపుకి) తమవైపుకు లాగుతుంటాయి. (2.60) ఇంద్రియములను తన వశంలో ఉంచుకున్న సాధకుడు తన మనస్సును ఆత్మయందు నిలిపి ఉంచాలి. పరమాత్మయందే ఆసక్తి కలిగి ఉండాలి. ఇంద్రియములు, మనస్సు స్వాధీనంలో ఉన్నవాడి జ్ఞానం స్థిరంగా ఉంటుంది. (2.61) ఇంద్రియ విషయముల మీద ఆలోచన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. అట్టి ఆసక్తి వలన దానియందు ఆతనికి కోరికగా మారుతున్నది. ఆ కోరిక వలన కోపము పుట్టుచున్నది. (2.62) కోపము వలన అవివేకము, అవివేకము వలన మరుపు, మరుపు వలన బుద్ధినాశము క్రమముగా సంభవించుచున్నవి. బుద్ధినాశముచే చివరికి పూర్తిగా చెడినవాడగుచున్నాడు. (2.63)

ఇంద్రియ నియంత్రణ మరియు స్వీయ జ్ఞానం ద్వారా శాంతి మరియు ఆనందాన్ని పొందడం

రాగద్వేషములు లేకుండా తన స్వాధీనంలో మనస్సు, ఇంద్రియములు ఉన్న మానవుడు, బయట ప్రపంచంలో తిరుగుతున్నా, బయట ప్రపంచంలో ఉన్న సుఖాలను అనుభవిస్తున్నా, తాను మాత్రం పరమశాంతంగా ఉంటాడు. (2.64) అటువంటి శాంతిని పొందిన మానవుడికి దు:ఖములు అంటూ ఏమీ ఉండవు. అతడి చిత్తము ప్రశాంతంగా ఉంటుంది. అతడి బుద్ధి ఎల్లప్పుడూ పరమాత్మ నందే లగ్నమయి ఉంటుంది. (2.65) ఇంద్రియములు మనస్సు వశంలో లేని వాడికి బుద్ధి కూడా నిశ్చయంగా ఉండదు. అటువంటి వాడి మనసులో పరమాత్మ గురించి ఎటువంటి ఆలోచనా కలుగదు. ఎప్పుడూ ప్రాపంచిక విషయముల గురించి ఆలోచిస్తుంటాడు. అటువంటి వాడికి మానసిక శాంతి కరువవుతుంది. అటువంటి వాడికి సుఖం, శాంతి ఎలా లభిస్తుంది? (2.66)

ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయములలో, విషయ వాంఛలలో మునిగి తేలేవాడి మనస్సు బాగా వీస్తున్న గాలిలో నీటిపై తేలుతున్న నావ మాదిరి అటు ఇటు ఊగుతూ ఉంటుంది. (2.67) కాబట్టి ఓ అర్జునా! నిగ్రహము లేని ఇంద్రియములు మానవుని బుద్ధిని అంటే విచక్షణా శక్తిని హరించివేస్తాయి. అలా కాకుండా ఇంద్రియాలను, మనసును అదుపులో ఉంచుకున్న వాడి బుద్ధి జ్ఞానము, నిశ్చయంగా, స్థిరంగా ఉంటుంది. (2.68) సర్వ భూతములకు ఏది పగలో అది పండితునికి అజ్ఞానపు రాత్రి, మరియు సర్వ భూతములకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు. (2.69) (ఊహాజనిత ప్రపంచంలో రాత్రి చాలా మంది నిద్రపోయి, కలల ప్రణాళికలు వేస్తుండగా, ఒక యోగి మాత్రం మేల్కొని లేదా ప్రపంచం నుండి వేరుచేయబడతాడు.)

ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా, ఎలాగైతే సముద్రం నిశ్చలంగా/ప్రశాంతంగా ఉంటుందో, అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా, చలించని యోగి శాంతిని పొందుతాడు; కోరికలను సంతృప్తిపరచుకోవటానికే కృషి చేసే వ్యక్తి ఇది పొందడు. (2.70) కోరికలను వదిలిపెట్టి, మమత, అహంకారము, ప్రాపంచిక విషయముల మీద అసక్తి వదిలిపెట్టి, తిరిగే వాడు నిరంతర శాంతిని పొందుతాడు. (2.71) ఓ అర్జునా! దీనినే బ్రాహ్మీస్థితి అని అంటారు. ఈ బ్రాహ్మీస్థితిని పొందిన వాడు మోహములో పడడు. అతడు తన అంత్యకాలములో కూడా ఈ బ్రాహ్మీ స్థితిలో స్థిరంగా ఉంటాడు. పరమ సుఖాన్ని, పరమ శాంతిని పొందుతాడు. అతడు మరణానికి భయపడడు. ఆనందంగా ఈ శరీరాన్ని విడిచిపెడతాడు. (2.72)

3. వ అధ్యాయము: కర్మయోగము

అర్జునుడు ఇలా పలికెను:  ఓ కేశవా! నీవు చెప్పిన దానిని బట్టి కర్మ కంటే జ్ఞానమే మంచిది అనేది నీ భావన అని తెలుసుకున్నాను. అయితే నన్ను భయంకరమైన, హింసతో కూడిన, సర్వనాశన హేతువైన, ఈ యుద్ధం చేయమని నన్ను ఎందుకు పురికొల్పుతున్నావు? కృష్ణా! నీ మాటలు అన్నీ చాలా తికమకగా ఉన్నాయి. నీ మాటలతో నా బుద్ధి ఒక విధమైన భ్రమకు లోనవుతూ ఉంది. కాబట్టి ఏదో ఒక మార్గం చెప్పుము. జ్ఞానం సంపాదించడానికి గురుకులానికి వెళ్ళమంటావా లేక కర్మ మార్గం అనుసరించమంటావా! ఏదో ఒకటి ముందు నువ్వు నిశ్చయం చేసుకుని తరువాత నాకు చెప్పు. (3.01-02) శ్రీ భగవానుడు సమాధానమిచ్చెను: ఓ అర్జునా! నీకు ఇంతకు ముందే ఈ లోకంలో రెండు నిష్టలు అనగా జీవన విధానాలు ఉన్నాయని చెప్పాను కదా! సాంఖ్య యోగులు అంటే జ్ఞాన యోగులకు సాంఖ్య యోగము, సాధారణ యోగము అభ్యసించే వారికి కర్మయోగము నిర్దేశించబడ్డాయి. ఎవరెవరికి ఏయే యోగము నందు ఆసక్తి ఉందో వారు ఆయా యోగములను అనుసరించవచ్చు. (3.03) ఎవరికీ కూడా కర్మలు చేయకుండా నైష్కర్య సిద్ధి, ఆత్మజ్ఞానము లభించదు. వారికి జ్ఞానము కూడా కలుగదు. కేవలం కర్మ సన్యాసము (ఏ పనీ చేయకుండా ఉండటం) వలన ఆత్మజ్ఞానము, మోక్షసిద్ధి కలుగదు. కాబట్టి కర్మలు చేయడం ప్రతి మానవునికీ అవసరం. (3.04) కాబట్టి ప్రతి మానవుడు ప్రకృతి ధర్మములను అనుసరించి కర్మ చేయక తప్పదు. కర్మలు చేయకుండా ఉండే స్వతంత్రత మానవునికి లేదు. మానవుడు కర్మలకు వశుడై ఉండాలి. (3.05) కొంత మంది బలవంతంగా ఇంద్రియములను నిగ్రహించి, ధ్యానంలో కూర్చుంటారు. కాని మనసు మాత్రం తన ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటుంది. అనేక విషయముల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అటువంటి వారు విమూఢాత్ములు. వారు చేసేది మిథ్యాచారము. ధ్యానము కాదు. (3.06)

ప్రతీ ఒకరు ఇతరులకు ఎందుకు సేవ చేయాలి?

ఓ అర్జునా! ఎవరైతే తన ఇంద్రియములను మనస్సుతో నిగ్రహించి, ఆ నిగ్రహించబడిన జ్ఞానేంద్రియ, కర్మేంద్రియములతో కర్మయోగమును ఎటువంటి ఆసక్తి లేకుండా ఆచరిస్తాడో, అతడిని విశిష్ఠపురుషుడు అని అంటారు. (3.07) నువ్వు శాస్త్రములో చెప్పబడిన కర్మలను, నీవు చేయతగ్గ కర్మలను, నిర్వర్తించు. కర్మలు చేయకుండా ఊరికే సోమరిగా ఉండటం కన్నా కర్మలు చేయడమే ఉత్తమం. కనీసం నీ శరీర నిర్వహణ కోసమన్నా నీవు కర్మలు చేయక తప్పదు. (3.08) ఇతరుల కోసం, సమాజం కోసం, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, నిష్కామంగా చేసే కర్మలు కాకుండా ఇతర కర్మలను చేయడం వలన మానవులు కర్మబంధనములలో చిక్కుకుంటారు. కాబట్టి ఓ అర్జునా! నీవు కూడా ఎటువంటి ఆసక్తి, అనురక్తి లేకుండా నీ విధిని నీవు నిర్వర్తించు. అప్పుడు నీకు కూడా ఎటువంటి బంధనములు అంటవు. (3.09)

సృష్టికర్త యొక్క మొదటి ఆజ్ఞ, ఒకరికొకరు సహాయపడటం

సృష్టి ఆరంభంలోనే బ్రహ్మదేవుడు యజ్ఞసహితముగ ప్రజలను సృష్టించి, మీరు యజ్ఞముల ద్వారా వృద్ధి చెందండి. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోర్కెలన్నింటినీ తీరుస్తాయి అని చెప్పాడు. (3.10) యజ్ఞముల ద్వారా మీరు దేవతను తృప్తిపరచండి. ఆ దేవతలు మీకు మేలు చేస్తారు. ఈ విధంగా మీరు పరస్సరము సంతృప్తిపరచుకొనుచు శ్రేయస్సును పొందగలరు. (3.11) యజ్ఞముల వలన దేవతలు తృప్తిచెందుతారు. వారు మానవులకు కోరకుండానే వరాలు ప్రసాదిస్తారు. దేవతలు ప్రసాదించిన వరములను అనుభవిస్తూ కూడా, ఆ వరముల ద్వారా వచ్చిన ఫలములను దేవతలకు కృతజ్ఞతా భావంతో ఎవరికీ నివేదించకుండా తానే అనుభవిస్తాడో, వారు దొంగలతో సమానం. (3.12) యజ్ఞశిష్టమైన ఆహారమును అంటే పరమాత్మకు నివేదించిన ఆహారమును తినే వారికి సకల పాపములు తొలగిపోతాయి. కేవలం తమ శరీర పోషణకు మాత్రమే ఆహారం వండుకుని తినే వారు పాపములు తింటున్నట్లుగా భావించబడుతుంది. (3.13) ప్రాణులన్నీ అన్నము నుండి జన్మిస్తున్నాయి. వర్షము వలన అన్నము ఉత్పత్తి అవుతూ ఉంది. వర్షములు యజ్ఞములు చేయడం వలన కురుస్తున్నాయి. చేయవలసిన పనులు అంటే హోమములు మొదలగు కర్మలు యజ్ఞములకు మూలము. ఆ చేయవలసిన పనులు అన్నీ వేదములలో చెప్పబడ్డాయి. వేదములకు మూలము పరమాత్మ. ఆ పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉంటాడు. అందరిలోనూ ఉంటాడు. మానవుడు చేసే అన్ని కర్మలలోనూ స్థిరంగా ఉంటాడు. ఇది ఒక చక్రము. నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ( 4.32 లో కూడా చూడండి). (3.14-15) ఓ అర్జునా! ఎవరైతే జరుగుతున్న సృష్టి చక్రమునకు అనుకూలంగా ప్రవర్తించరో, అటువంటి వాడు తన కర్తవ్య కర్మలను అంటే చేయవలసిన కర్మలను చేయకుండా, ఇంద్రియలోలుడై పాపము చేస్తున్నాడు. అటువంటి వాడి జీవితము వ్యర్ధము. (3.16) ఎవరైతే తనలో తాను అంటే తన ఆత్మలో రమిస్తూ ఉంటాడో, దొరికిన దానితో తృప్తి చెందుతుంటాడో, అతడు నిత్యము సంతుష్టుడిగా ఉంటాడు. అటువంటి సాధకుడికి చేయవలసిన కర్మ అంటూ ఏదీ ఉండదు. (3.17) అటువంటి వారికి ఈ ప్రపంచంలో కర్మలు చేయడం వలన కానీ, చేయకుండా ఉండటం వలన గానీ, ఎటువంటి ప్రయోజనమూ లేదు. అటువంటి సాధకుడికి స్వార్ధబుద్ధి కానీ, బాహ్య ప్రపంచముతో సంబంధము కానీ ఉండదు. (3.18)

నాయకులు మార్గదర్శకులు కావాలి

ఆ కారణం చేత అర్జునా! నీవు కూడా ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి లేకుండా నీ కర్తవ్య కర్మ అయిన యుద్ధాన్ని చెయ్యి. ఆసక్తి లేకుండా యుద్ధం చేస్తే ఆ యుద్ధం వలన వచ్చే బంధనములు నిన్ను అంటవు. నీకు మోక్షం కూడా వస్తుంది. (3.19) పూర్వము జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తి రహితముగా కర్మలను చేయడం వలన సిద్ధి పొందారు. కావున నీవు కూడా స్వార్ధం వదిలి లోకహితము కోసం కర్మలు చేయడానికి మాత్రమే నీకు అర్హత ఉంది. (3.20) శ్రేష్టులు అయిన వారు ఆచరించిన దానిని ఇతరులు కూడా అనుసరిస్తారు. అతడు ఆచరించిన ప్రమాణాలనే ఇతరులు కూడా పాటిస్తారు. (3.21) అర్జునా! ఈ మూడు లోకాలలో నేను చేయాల్సిన కర్తవ్యం అంటూ కొంచెం కూడా ఏమీ లేదు. అలాగే నేను కోరుకోదగినది, పొంద తగినది, నేను పొందలేనిదీ ఏదీ లేదు. అయినప్పటికినీ నేను అనునిత్యం కర్మలు చేస్తూనే ఉన్నాను. (3.22) ఓ అర్జునా! నేను నా కర్తవ్య కర్మలు అత్యంత శ్రద్ధతో నెరవేర్చకపోతే ఇతరులు కూడా నన్నే అనుసరిస్తారు. కృష్ణుడే చేయలేదు మేమెందుకు చేయాలి అంటూ ఎవరూ ఏపనీ చేయరు. అంతా గందరగోళంగా తయారవుతుంది. అందరూ అధర్మపరులవుతారు. మానవులందరూ నన్నే అనుసరిస్తారు కాబట్టి నేను నిరంతరము కర్మలు చేస్తూనే ఉంటాను. (3.23-24) ఎలాగైతా అజ్ఞానులు ఎక్కువగా ప్రాపంచిక కర్మల మీద ఆసక్తి కలిగి ఉండి, వాటినే ఆచరిస్తుంటారో, అలాగే జ్ఞానులు కూడా ఎక్కువగా లోక హితము కోసం, ఎటువంటి ఆసక్తి, స్వార్ధబుద్ధి లేకుండా, కర్మలు చేస్తుంటారు. (3.25) ఈ లోకంలో ఎంతో మంది ఆత్మజ్ఞానము కలిగిన వారూ, ఏమీ తెలియని అజ్ఞానులూ ఉన్నారు. జ్ఞానులు అయిన వారు తాము కర్మలు ఎలా చేయాలో ముందు తాము చేసి, అజ్ఞానులకు చూపించి, వారికి నచ్చచెప్పి, వారితో నిష్కామ కర్మలను చేయించాలి. వారికి మార్గదర్శకులు కావాలి. ( 3.29 లో కూడా చూడండి) (3.26)

అన్ని కర్మలు ప్రకృతి నిర్దేశించినవే

ఓ అర్జునా! మానవులు చేసే కర్మలు అన్నీ ప్రకృతిలో ఉన్న సత్వ రజస్తమోగుణముల మీదనే ఆధారపడి ఉన్నాయి. ఆ మూడు గుణముల ప్రభావంతోనే మానవుడు అన్ని కర్మలు చేస్తున్నాడు. కానీ అహంకార పూరితుడైన మానవుడు ఈ కర్మలు అన్నీ నేనే చేస్తున్నాను, నా వలననే అంతా జరుగుతూ ఉంది అని భావిస్తుంటాడు. (5.09, 13.29, మరియు 14.19 లో కూడా చూడండి) (3.27) కానీ గుణముల తత్వమును కర్మల స్వభావమును తెలిసిన జ్ఞాని, ప్రకృతిలో ఉన్న మూడు గుణములు తనతో ఉన్న మూడు గుణములతోనే ప్రవర్తిస్తున్నాయి అని తెలుసుకుని, ఆ గుణముల యందు, వాటి ప్రభావము నందు ఎటువంటి ఆసక్తి చూపించడు. నిర్లిప్తతగా ఉంటాడు. (3.28) ప్రకృతి గుణముల యొక్క మోహములో పడ్డ వారు ఆ ప్రకృతి గుణములలోనూ ఆ గుణముల ప్రభావంతో చేసే కర్మలలోనూ ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి వారిని, ఏమీ తెలియని అజ్ఞానులను, మందబుద్ధి కలవారిని, అన్నీ తెలిసి ఆత్మజ్ఞానము పొందిన జ్ఞానులు, తమ బోధనలతో మోహమునకు గురిచేయకూడదు. (3.26 లో కూడా చూడండి) (3.29) ఓ అర్జునా! నీ చిత్తమును పరమాత్మ యందు నిలిపి, కర్మలను అన్నిటినీ ఆధ్యాత్మ చిత్తముతో ఆ పరమాత్మకు అర్పించి, ఆశ, మమకారము, మమత, అనురాగము మొదలగు ఆశాపాశములను వదిలి పెట్టి, క్షత్రియ ధర్మము అయిన యుద్ధం చెయ్యి (3.30) ఎటువంటి అసూయ లేకుండా, పైన చెప్పబడిన తనకు నిర్దేశింపబడని విహిత కర్మలను అత్యంత శ్రద్ధతో ఆచరించేవారు సకల కర్మల బంధనాల నుండి విముక్తిని పొందుతారు. అలా కాకుండా ఎల్లప్పుడూ నా మీద దోషారోపణ చేస్తూ, నా చేత చెప్పబడిన మతమును విశ్వసించని వారు అచేతనులు అంటే బుద్ధిహీనులు, ఏ మాత్రము జ్ఞానము లేని మూఢులు, అన్ని విధాలా నష్టపోయినవారు అవుతారు. (3.31-32) మానవులే కాదు సకల ప్రాణులు కూడా ప్రకృతి నియమాలను అనుసరించి ప్రవర్తిస్తున్నాయి. అటువంటప్పుడు మానవునికి సహజ గుణములను నిగ్రహించడం వలన, ప్రకృతి స్వభావాలకు విరుద్ధంగా ప్రవర్తించడం వలన మానవుడు ఏమి చేయగలడు? (3.33)

పరిపూర్ణత మార్గంలో రెండు ప్రధాన అవరోధాలు

ఇంద్రియములకు, రాగద్వేషాలు ఉంటాయి. అంటే ఇది నాకు ఇష్టము ఇది ఇష్టము లేదు అని. ఆ రాగద్వేషములకు లోబడితే బంధనములు తప్పవు. మానవుడు రాగద్వేషములకు లోనుకాకూడదు. ఎందుకంటే రాగద్వేషములు మానవునికి శత్రువులు. (3.34) చక్కగా ఆచరింబడిన పరధర్మము కంటే, గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. స్వధర్మాచరణములో మరణించినా శ్రేయస్కరమే. ఎందుకంటే పరధర్మము చాలా భయంకరమైనది. ( 18.47 కూడా చూడండి) (3.35)

కామం (కోరిక) పాపానికి మూలం

అర్జునుడు అడిగాడు: ఓ కృష్ణా! ఎవరూ కావాలని పాపాలు చేయరు కదా! ఏ శక్తి మానవుని చేత చెడ్డపనులు, దుర్మార్గాలు చేయిస్తూ ఉంది? (3.36) శ్రీ కృష్ణభగవానుడు చెప్పెను: రజోగుణము వలన పుట్టిన కామము, క్రోధము మనకు శత్రువులు. కోరికలు ఎన్ని తీరినా ఇంకా కోరికలు మిగిలే ఉంటాయి. కామదాహమునకు అంతే లేదు. ఈ కామములు తీరకపోతే అవి మనకు శత్రువులుగా పరిణమించి, అనేక మహాపాపాములకు కారణం అవుతూ ఉంటాయి అని తెలుసుకో! (3.37) పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత గర్భంలో ఉన్న శిశువు కప్పబడి ఉన్నట్లు, ఈ కామము దాని వలన పుట్టే క్రోధము, మనలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని కప్పి ఉంచుతుంది. (3.38) అర్జునా! ఈ కామము సాధకునిలోని జ్ఞానములను కప్పి ఉంచుతుంది. జ్ఞానులు సాధకుల సంగతే ఇలా ఉంటే, ఇంక సాధారణ మానవుల సంగతి చెప్పేదేముంది?(3.39) ఈ కామము (అంటే చూచినది, విన్నది, ముట్టుకున్నది, రుచి చూసిన ప్రతీది కావాలి అనే తత్వము) మానవుని దేహములో ఉన్న ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని ఆశ్రయించుకుని ఉంటుంది. మానవునిలో ఉన్న మనో, బుద్ధి, ఇంద్రియాలు, తనలో చెలరేగిన కామాలను అన్నింటినీ తీర్చడానికి శతథా ప్రయత్నం చేస్తుంటాయి. అపుడు లోపల ఉన్న ఆత్మజ్ఞానము కప్పబడిపోతుంది. మానవుడు తీవ్రమైన మోహంలో పడిపోతాడు. (3.40) అందువల్ల, అర్జునా! ఈ కామాన్ని జయించాలంటే, ముందు నీ ఇంద్రియములను, వాటి విషయగ్రహణ శక్తిని అదుపులో పెట్టుకో. తర్వాత కామాన్ని జయించు. (3.41)

కోరికలను ఎలా నియంత్రించాలి?

ఇంద్రియములు చాలా గొప్పవి. ఇంద్రియముల కన్నా మనసు గొప్పది. మనసు కంటే బుద్ధి గొప్పది. ఈ మూడింటి కంటే గొప్పది ఆత్మ. ( 6.07-08 కూడా చూడండి) (3.42) అర్జునా! బుద్ధి కంటే ఆత్మ బలమైనదని చెప్పాను కదా! ఆత్మ తర్వ